‘2024 ఎన్నికల్లో బీజేపీకి ఈ పరిస్థితి ఉండదు’

by GSrikanth |
‘2024 ఎన్నికల్లో బీజేపీకి ఈ పరిస్థితి ఉండదు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజీపడేది లేదని రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గని భరత్ రామ్ అన్నారు. గురువారం ఉదయం తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో గళమెత్తుతున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమితో సంబంధం లేకుండా బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారని, కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఈ పరిస్థితి ఉండదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత కేంద్రానికి వైసీపీ సపోర్ట్ అనివార్యంగా ఉంటుందని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల తర్వాత ఏపీ మంచి రోజులు వస్తాయని అన్నారు.

Advertisement

Next Story