- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
breaking: వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌కు ఘోర పరాభవం
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. వైసీపీని వీడేందుకు సిద్ధమైన ఎంపీటీలు, సర్పంచులను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ భరత్ రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన రామకుప్పం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు పెద్దు ఎత్తున చేరుకున్నారు. భరత్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని భరత్ అడ్డుకుంటున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భరత్‌ను అక్కడి నుంచి పంపించారు. అనంతరం ఆందోళనకారులతో మాట్లాడి వివాదాన్ని సర్దుమనిగించారు.
కాగా కుప్పంలో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబుపై కుప్పం నుంచి భరత్ పోటీ చేశారు. అయితే వైసీపీ భారీ ఓటమిని చవిచూసింది. అంతకుముందు జగన్ పాలనలో కుప్పం నిప్పులకుంపటిగా మారింది. ఐదేళ్ల పాటు టీడీపీ కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు వారిపైనే అక్రమంగా కేసులు పెట్టారు. కొన్నిసార్లు చంద్రబాబు పర్యటనను సైతం అడ్డుకున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఘోర ఓటమి పాలయ్యారు. దీంతో కుప్పం నియోజకవర్గానికి చెందిన 15 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు వైసీపీని వీడి బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో కుప్పం వైసీపీ కార్యాలయం మూతపడింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన ఎమ్మెల్సీ భరత్ బుజ్జగింపులకు దిగారు. రామకుప్పంలో పర్యటించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.