Minister Amarnath: ఆమె ఊసరవెల్లి శ్రీదేవి

by srinivas |   ( Updated:26 March 2023 10:53 AM  )
Minister Amarnath: ఆమె ఊసరవెల్లి శ్రీదేవి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆమెపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. టీడీపీకి ఓటు వేసి సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచారని మండిపడుతున్నారు. తాజాగా మంత్రి అమర్‌నాథ్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉండవల్లి శ్రీదేవి అనే కంటే ఊసరవెల్లి శ్రీదేవి అని మార్చుకుంటే బెటర్ అని వ్యాఖ్యానించారు. సినీ నటి శ్రీదేవి కంటే ఎమ్మెల్యే శ్రీదేవి నటన అద్భుతంగా ఉందని ఎద్దేవా చేశారు. తాను వైసీపీకి ఓటు వేశానని నమ్మించేందుకు ఆమె నటించారని అమర్‌నాథ్ విమర్శించారు. ఓటుకు నోటు ఆఫర్ చేశారని రాపాక వరప్రసాద్ చెప్పాక కొత్తగా చర్చలెందుకని అమర్‌నాథ్ ప్రశ్నించారు.

Advertisement
Next Story