- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఆ దృశ్యాలను బయట పెట్టాలి’.. మంత్రి రామనారాయణ రెడ్డికి వైసీపీ నేత సంచలన సవాల్!

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) ఘటనకు సంబంధించి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం గురించి చెడుగా చెప్పాలని తిరుపతి తొక్కిసలాట బాధితులకు వైసీపీ నేతలు(YCP Leaders) డబ్బు కవర్లు ఇచ్చారని మంత్రి ఆనం రామనారాయణ(Minister Ramanarayana Reddy) రెడ్డి నిన్న నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ఆనం రామనారయణ రెడ్డి తొక్కిసలాట ఘటన పై మాట్లాడిన తీరును వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) విమర్శించారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తిరుపతి తొక్కిసలాట బాధితుల గురించి మంత్రి రాంనారాయణ రెడ్డి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. క్షతగాత్రులకు వైసీపీ డబ్బులిచ్చి ప్రభుత్వం(AP Government)పై ఆరోపణలు చేయించిందనడం దారుణమన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఉందన్న మంత్రి, ఆ దృశ్యాలను బయట పెట్టాలన్నారు. లేకపోతే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. జగన్(YS Jagan) వస్తున్నారనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆస్పత్రి పర్యటన పొడిగించుకున్నారని ఆరోపించారు.