Ysrcp: హోదాపై కోర్టులో పిటిషన్.. జగన్ మరోసారి హాట్ కామెంట్స్

by srinivas |
Ysrcp: హోదాపై కోర్టులో పిటిషన్.. జగన్ మరోసారి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఎంతో వైభోగంగా 151 సీట్లు సాధించిన ఆ పార్టీ 2014లో 11కే పరిమితమైంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా నెంబర్ ప్రకారం దక్కకుండా పోయిది. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్(YCP chief Jagan) డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Assembly Speaker Ayyannapatrudu)ను సైతం కోరారు. కానీ ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్‌పై కోర్టు విచారణ దశలో ఉంది.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అయితే ఈ సమావేశానికి సైతం వైఎస్ జగన్ హాజరుకాలేదు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతోనే ఆయన అసెంబ్లీకి వెళ్లలేదని తెలుస్తోంది. అయితే మిగిలిన అసెంబ్లీ సమావేశాల పట్ల పార్టీ నేతలు అనుసరించాలని తీరుపై జగన్ దృష్టి పెట్టారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని తెలిపారు. కౌంటర్‌కు స్పీకర్‌ సమాధానం ఇవ్వడంలేదన్నారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీ అనే తెలిపారు. కానీ, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed