వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసీపీలో ఉంది : గంటా శ్రీనివాసరావు

by Seetharam |
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసీపీలో ఉంది : గంటా శ్రీనివాసరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో బోగస్ ఓట్ల చేర్పులు ప్రతీ నియోజకవర్గంలో ఉన్నాయని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఒక్క విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ఇదే తంతు అని చెప్పుకొచ్చారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ బోగస్ ఓట్లు చేర్పించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలను అవలంభిస్తుందన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం తాడిచెట్ల పాలెంలో గీతం ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. బోగస్ ఓట్ల అంశంపై అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దాని ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటింటి సర్వే జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. ఉత్తర నియోజకవర్గంలోని దాదాపు అన్ని వార్డుల్లో బోగస్ ఓట్లు ఉన్నట్లు ప్రాధమికంగా తేలింది. దీనిపై దర్యాప్తు చేయాలి....బోగస్ ఓట్ల తొలగింపులో అధికారులు అలసత్వంగా వుంటే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఎలాగూ గెలవలేమనే ఉద్దేశంతోనే వైసీపీ అవకతవకలకు పాల్పడుతోంది అని మండిపడ్డారు. ఒక్కో డోర్ నెంబర్ పై గరిష్టంగా 200 ఓట్లు ఉన్నాయంటే అర్ధం చేసుకోవాలన్నారు. ఒక్క ఛాన్స్ అవకాశం జగన్ కోల్పోయారని విమర్శించారు. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ది లేదు అని అన్నారు. పథకాల అమలులో 98.5 అమలు చేయడం కాదు.....98.5 శాతం జగన్ ప్రభుత్వం విఫలమైంది అని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నా... పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed