Breaking: 5వ జాబితా పై వైసీపీ కసరత్తు.. విడుదల ఎప్పుడంటే..?

by Indraja |
Breaking: 5వ జాబితా పై వైసీపీ కసరత్తు.. విడుదల ఎప్పుడంటే..?
X

దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ అధినేత అడుగులు వేస్తున్నారు. ఇక వైసీపీ అధిష్టానం ఐప్యాక్ సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం 68 అసెంబ్లీ లోక్ సభ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఇక తాజాగా 5 వ జాబితా పై కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. నిన్న ఉదయం నుండి 5 వ జాబితా పై ఈ కసరత్తు కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో సంబంధిత నేతలను సీఎం క్యాంపు ఆఫీస్ కి రావాల్సిందిగా ఆదేశించింది. దీనితో వైసీపీ నేతలు తాడేపల్లి లోని సీఎం క్యాంపు ఆఫీస్ కి క్యూ కట్టారు. ఇక ఉదయం నుండి సీఎంఓ లోనే ఉన్న వైసీపీ కీలక నేతలు విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి 5 వ జాబితాపై కసరత్తు కొనసాగుతున్నారు. ఇక 5 వ జాబితా నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్, పొన్నాడ సతీష్, ధనలక్ష్మీ, ఎమ్మెల్సీ అనంతబాబు, కూడా తాడేపల్లి లోని సీఎం క్యాంపు ఆఫీస్ కి చేరుకున్నారు.

ఇక ఈ 5 వ జాబితాలో 15 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలను పిలిచి చర్చిస్తున్నారు. అలానే మార్పులు చేర్పులకు సంబంధించి ప్రత్యామ్నాయంగా ఏ అభ్యర్థి ఉంటె బాగుంటుంది, గెలిచే అవకాశం ఎవరికి ఉంది అనే అంశాలపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో 5 వ జాబితా ఈ రోజు లేక రేపు విడుదలైయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Advertisement

Next Story