- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YCP Dalit MLAS: సీఎం సార్.. వారిని వదలొద్దు..!
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో వైసీపీ దళిత ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్‌తోపాటు మంత్రులు కలిశారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సభా నాయకుడికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల దాడిలో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మోచేతికి గాయమైందని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్ బాబు మోచేయి గాయాన్ని సీఎం జగన్‌కు చూపించారు. ఇకపోతే సభలో తనపై జరిగిన దాడి పట్ల సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో దళిత ఎమ్మెల్యేపై టీడీపీ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో శిఖండిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేని అడ్డుపెట్టుకుని దుష్టరాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులను అడ్డంపెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దళితులంటే వివక్ష ఉందని ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడిని ప్రతీ గడప గడపకు రాబోయే రోజుల్లో వివరిస్తామని తెలిపారు. దళితవాడల్లోని ప్రతీ గడపకు చంద్రబాబు హయాంలో.. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానంలను వివరిస్తామని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.