- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
YCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. సోషల్ మీడియా ఇంచార్జ్ రాకేశ్ గాంధీ అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: కూటమి సర్కార్ వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) విభాగంపై ఉక్కుపాదం మోపుతోంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలపై అభ్యంతర పోస్టులు పెట్టడం, అధికారం కోల్పోయక కూడా తీవ్ర అసహనంతో అదే దాడిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంపై సీఎం చంద్రబాబు సర్కార్ చట్టపరంగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. తాజాగా, చిలకలూరిపేట (Chilakaluripeta) వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ రాకేశ్ గాంధీ (Rakesh Gandhi)ని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు (Pratipati Pullarao)తో పాటు టీడీపీ (TDP) నేతలపై సోషల్ మీడియా (Social Media)లో అసభ్యకర పోస్టులను పెట్టారనే అభియోగం మేరకు రాకేశ్ గాంధీ (Rakesh Gandhi)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ప్రతిపక్ష నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన కారణంగా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి (Bhargav Reddy)పై, రాష్ట్ర నాయకుడు అర్జున్ రెడ్డి (Arjun Reddy), వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి (Varra Ravinder Reddy)లపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. పులివెందుల పోలీసులు సజ్జల భార్గవ్ రెడ్డి సహా ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (SC, ST Atrocities) కింద కేసు నమోదు చేశారు. టీడీపీ (TDP) నేతలపై సోషల్ మీడియా (Social Media)లో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించిన తనను కులం పేరుతో దూషించారంటూ సింహాద్రిపురం (Simhadripuram) దళిత సామాజికవర్గానికి చెందిన హరి (Hari) అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.