వైసీపీ, ఆప్ ఒక్కటే.. వెల్ఫేర్ పేరుతో విధ్వంసం సృష్టించారు

by Anil Sikha |
వైసీపీ, ఆప్ ఒక్కటే.. వెల్ఫేర్ పేరుతో విధ్వంసం సృష్టించారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో వైసీపీ, ఢిల్లీ ఆమ్​ఆద్మీ పార్టీల పాలసీ ఒకటేనని, అందుకే అందుకే ఓటమిని చవిచూశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఇవాళ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రెండు పార్టీలు ఏపీ, ఢిల్లీలో వెల్ఫేర్​పేరుతో విధ్వంసం సృష్టించాయని విమర్శించారు. విధ్వంసం చాలా సులభమని, నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టమని పేర్కొన్నారు. సంపద సృష్టించలేని వ్యక్తులకు బటన్ నొక్కే అధికారం ఎక్కడుందన్నారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకని ప్రశ్నించారు. ఇది సమాజానికి పెద్ద ప్రమాదమన్నారు. కొందరు నేతలు సంక్షేమం కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వారి వల్ల రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధిపైన దృష్టి పెట్టినప్పుడే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో ప్రజలు చాలా తెలివైన వాళ్లని, ఒకసారి మోసపోయినా రెండోసారి ఆలోచిస్తారని అభిప్రాయపడ్డారు. అది ఆంధ్రప్రదేశ్లో, ఇవాళ ఢిల్లీలో జరిగిందన్నారు. గతంలో ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును జగన్, కేజ్రీవాల్​కాటేసారని ఆరోపించారు. ప్రజల అవకాశాలను పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిలైందని ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీపై ఢిల్లీ ప్రజలు నమ్మకం ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు.

సరైన సమయంలో సరైన నాయకత్వం

సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకమని, అందుకే ఢిల్లీ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరిచి, బీజేపీకి అఖండి విజయం అందించారని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు తరలిపోతున్నారని తెలిపారు. సూపర్ పాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలకవచ్చని చెప్పారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలను తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 1995-2024 మధ్య తలసరి ఆదాయం 9 రేట్లు పెరిగిందన్నారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరిగి మౌలిక వసతులు ఏర్పడతాయని తెలిపారు. బీహార్లో తలసరి ఆదాయం ఇంకా 750 డాలర్లే ఉందన్నారు. టెక్నాలజీ సాయంతో మనం ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. మనకు ఐటీ, మౌలిక వసతులు గేమ్ చేంజర్ గా మారాయని తెలిపారు. ఢిల్లీ సిటీ ఆఫ్ గార్బేజీ అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.


Advertisement
Next Story

Most Viewed