- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పరిహారం ఇచ్చాకే పనులు చేయాలి
by Anil Sikha |

X
దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ కాలనీలో గ్రామస్తులు ఇవాళ పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను అడ్డుకున్నారు. ఇవాళ పనులు చేయడానికి అధికారులు వెళ్లగా స్థానికులు జేసీబీ ఎక్కి నిరసన తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి తమకు న్యాయం చేసిన తర్వాతే పనులకు కొనసాగనిస్తామని మహిళలు స్పష్టంచేశారు. 46 ఎకరాల భూమికి ప్రస్తుత రేట్ల ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా తమకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్వాసితుల డిమాండ్లను నెరవేర్చకపోతే పోలవరాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. రైతులకు నష్టపరిహారం, కాలనీ నివాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలని కోరారు
Next Story