- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిడ్నాప్ తరహాలో నిర్బంధించి నోటీసులిస్తారా?..అయ్యన్న పై కక్ష సాధింపునకే అక్రమ కేసులు: చంద్రబాబు
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడి పై అక్రమ కేసులు, అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ చేసే దారుణ పరిస్థితులు దాపురించాయి అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే అయ్యన్నపై అక్రమ కేసులు, అరెస్టుతో కక్ష సాధిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని తూర్పారబట్టే బీసీ నేత అయ్యన్నపాత్రుడిపై మొదటి నుంచి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడికి 41 ఎ నోటీసు ఇవ్వడానికే పోలీసులు వచ్చి ఉంటే.... కిడ్నాప్ తరహాలో ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకువెళ్లాల్సిన, నిర్భందించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వంపై అయ్యన్న విమర్శలే నేరమైతే...మంత్రులు, వైసీపీ నేతలు రోజూ చేస్తున్న వ్యాఖ్యలకు, విధ్వేష ప్రసంగాలకు జీవితాతం జైల్లో పెట్టాలని అన్నారు. అసమర్థ, మాఫియా పాలకులను విమర్శించక ఏం చేస్తారు...ధైర్యం ఉంటే తమపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలి అని అన్నారు. జగన్ చేస్తున్న తప్పులు, నేరాల్లో ఇలా అక్రమ కేసులు బనాయించడం ద్వారా పోలీసులు భాగస్వాములు అయితే వాళ్లు తీవ్ర మూల్యం చెల్లిస్తారని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.