AP News:ప్రతిపక్ష హోదా ఉంటేనే జగన్ అసెంబ్లీకి వస్తారా?:టీడీపీ ఎమ్మెల్యే

by Jakkula Mamatha |
AP News:ప్రతిపక్ష హోదా ఉంటేనే జగన్ అసెంబ్లీకి వస్తారా?:టీడీపీ ఎమ్మెల్యే
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి నూతన ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. వైసీసీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమకు ప్రతిపక్ష హోదా కావాలంటూ మాజీ సీఎం జగన్ రాసిన లేఖకు టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలకు ముఖం చూపించలేక వైఎస్ జగన్ కుయుక్తులకు తెరలేపారని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి విమర్శించారు. కనీస అవగాహన లేకుండా జగన్ ప్రతిపక్ష హోదా కోరడం హేయమైన చర్య అన్నారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు ఉంటేనే ఆ హోదా వస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం బాధకరమన్నారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ ఎన్నిక రోజు సభ సంప్రదాయాలు పాటించకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed