AP:పార్టీ మార్పు ఆలోచనలో మాజీ మంత్రి..అలా జరిగితే వైసీపీకి భారీ షాక్?

by Jakkula Mamatha |   ( Updated:2024-06-18 08:21:20.0  )
AP:పార్టీ మార్పు ఆలోచనలో మాజీ మంత్రి..అలా జరిగితే వైసీపీకి భారీ షాక్?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందింది. ఎన్నికల ముందు వై నాట్ 175 స్థానాలు గెలుస్తామని ధీమాతో ఉన్న వైసీపీ ఊహించని ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీ నేతలను పరామర్శించి, సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల వెలువడిన తక్కువ సమయంలోనే ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం వీరిద్దరి జాబితాలో మాజీ మంత్రి విడుదల రజిని చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కొనసాగించలేనని భావించిన ఆమె ఎక్కువ రోజులు ఇక్కడ కొనసాగకూడదనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో విడుదల రజిని టీడీపీ పార్టీకి చెందిన గల్లా మాధవి చేతిలో 51 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఈ ఓటమితో విడదల రజిని తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక రాజకీయ భవిష్యత్తు పై ఆమె పునరాలోచన చేస్తున్నట్లు టాక్. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చర్చించారని తెలుస్తోంది. ఈ క్రమంలో విడదల రజిని ఓ జాతీయ పార్టీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఏది అనేది స్పష్టత రాలేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే టీడీపీతో జత కట్టిన విషయం తెలిసిందే.. ఇక దాదాపుగా ఉనికిలో లేని కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉండకపోవచ్చు. ప్రజెంట్ ఆమె ఏ పార్టీలో చేరుతారు అనే అంశం పై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed