- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కొత్త ఆస్పత్రుల నిర్మాణంలో ఆలస్యమెందుకు : పార్లమెంట్ లో ఎంపీ జీవీఎల్ ప్రశ్న
దిశ, ఉత్తరాంధ్ర : విశాఖపట్టణంలో 400పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణంతో పాటు ఏపీలోని ఇతర ఈఎస్‌ఐ ఆస్పత్రుల విషయమై రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఏపీకి కొత్తగా మంజూరైన 7ఆస్పత్రుల నిర్మాణం విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను ప్రశ్నించారు. విశాఖ ఆస్పత్రికి సంబంధించి కేంద్రం ఇప్పటికే రూ.384 కోట్లు మంజూరు చేసిందని, తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిఫలం వస్తే ఇఎస్‌ఐ బీమా పరిధిలోకి వచ్చే 4లక్షల మందికి తక్షణ ప్రయోజనం చేకూరుతుందని జీవీఎల్ గుర్తు చేశారు.
అనంతరం కేంద్రమంత్రి స్పందిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖ ఇటీవల కొన్ని మార్పులు చేసిందని, సీపీడీడబ్ల్యూతో పాటు నిర్మాణాలు చేపట్టే అన్ని ఇతర ప్రభుత్వ ఏజెన్సీలూ భవిష్యత్ నిర్మాణ ప్రాజెక్టుల్లో పాల్గొంటాయన్నారు. దీంతో రాష్ట్రంలో మిగతా ఆస్పత్రుల్ని కూడా తొందర్లోనే పూర్తి చేయగలమని, ఇలా 76ఆస్పత్రుల్ని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ప్రత్యేక డ్యాష్ బోర్డ్ కూడా తయారు చేయించినట్టు తెలిపారు. విశాఖ ఆస్పత్రి నిర్మాణ విషయంలో త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ నిర్మాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు.
READ MORE