- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధాని తిరుపతి ఎందుకు కాకూడదు?.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని తిరుపతి ఎందుకు కాకూడదని, దానికి ఆంధ్ర ప్రజలందరూ ఆమోదయోగ్యం పలుకుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ళ క్రితం మద్రాస్ నుంచి విడిపోయినప్పుడు తిరుపతి రాజధాని చేయాలని ఆచార్య రంగా ఆనాడే డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఈ 70 ఏళ్లలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఐదు సార్లు మారిందని అన్నారు. తాను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నానని, వారు తిరుపతి అయితే స్వామి కార్యం, స్వకార్యం రెండు పూర్తి చేసుకోవచ్చని తెలిపారన్నారు.
తిరుపతిలో ఏర్పేడు నుంచి రాపూరు దాకా దాదాపు లక్ష ఎకరాలు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని, ఇక్కడ అయితే రైతులకి పరిహారం ఇవ్వాల్సిన పని కూడా లేదన్నారు. అలాగే ఖండలేరు వల్ల నీటి కొదవ కూడా లేదన్నారు. తిరుపతిలో హైదరాబాద్ కంటే మంచి వాతావరణం ఉందని, 7 విశ్వవిద్యాలయాలు, 7 జాతీయ రహదారులు ఇలా అన్ని సదుపాయలు ఉన్నాయని తెలిపారు. అంతేగాక బ్రహ్మం గారు 300 ఏళ్ల క్రితమే తిరుపతి రాజధాని అవుతుందని చెప్పారని, ఆయన చెప్పినవన్నీ జరిగాయని, ఇది కూడా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే ఏపీలో జగన్ గాలి పూర్తిగా తగ్గిందని, రాయలసీమలో వెనుకబడిన ప్రాంత రైతుల కష్టాలు కన్నీళ్లు కనిపిస్తున్నాయని అన్నారు. రాయలసీమలోని యువత నిరుద్యోగంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, బీటెక్ పాసై బ్రాందీ షాప్ లో పని చేస్తు్న్నారని వాపోయారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడు అప్పుల్లో మునిగిపోయాడని, పేదల రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని సూచించారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం పేదల రుణమాఫీపై ఉంటుందని, ఆ విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.