AP News:రోడ్డు వెడల్పు ఎందుకు తగ్గుతుంది..?

by Jakkula Mamatha |
AP News:రోడ్డు వెడల్పు ఎందుకు తగ్గుతుంది..?
X

దిశ, కాజులూరు: మండలంలో కుయ్యేరు - గొల్లపాలెం రోడ్డు నిర్మాణం పట్ల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని అంటున్నారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాల్లో ఎవరికీ కూడా ప్రజా అంచనాలు ఇవ్వలేదు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కుయ్యేరు నుంచి గొల్లపాలెం దాకా 14 కిలోమీటర్ల పొడవునా రహదారి నిర్మాణం కోసం గత వైసీపీ ప్రభుత్వం లో నిధులు మంజూరు అయ్యాయి. అప్పట్లో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ నిర్లక్ష్య వైఖరి తో నిధులు దారి మళ్లాయి. అప్పటి నుంచి స్థానికులు రహదారి నిర్మాణం లేక గతుకుల మయం అయిన రోడ్డు మీద నానా అవస్థలు పడుతున్నారు.

అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి సుభాష్ ను స్థానికులు గట్టి పట్టు పట్టారు. కాజులూరు జన సైనికులు జిల్లా కలెక్టర్ ను కూడా కలిశారు. కలెక్టర్ చొరవతో పనులు ప్రారంభమయ్యాయి. కానీ సంబంధిత అధికారులు పనులు చేయడంలో నిబంధనలు పక్కన పెడుతున్నారు. రాత్రి ళ్లు చేయాల్సిన వాటరింగ్ పగలు చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ నిలిచిపోతుంది. రోడ్డు మొత్తం 9 మీటర్లు వెడల్పుతో వేయాల్సి ఉండగా కొన్ని చోట్ల 7 మీటర్లు మాత్రమే వేస్తున్నారు. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. విషయమై రోడ్లు భవనాల శాఖ అది కారులను వివరణ కోరగా గ్రామం లో రోడ్డు వేసే ప్రాంతంలో స్థలం బట్టి వెడల్పు చేస్తున్నామని అంటున్నారు. వాటరింగ్ విషయంలో సరైన సమాధానం చెప్పడం లేదు. విషయమై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed