- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్కరకు రాని అనుభవం ఎందుకు బాబు..? కూటమి పాలనపై మాజీ సీఎం జగన్ ఫైర్

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు (Chandrababu) చేసిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని, జనం ఎవరి కాలర్ పట్టుకొని అడగాలి అని మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YSRCP chief Jagan Mohan Reddy) ప్రశ్నించారు. వైసీపీ కేంద్ర కార్యాలయం (YSRCP central office)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వం (coalition government)పై సంచలన ఆరోపణలు చేస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చారని, సీఎం అయ్యాక ఇక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేక పోయారని అన్నారు. ఎన్నికల్లో బాబు ష్యూరిటీ (Babu assurance) మాత్రం ఇస్తాడు.. కానీ గెలిచాక పథకాల అమలుకి గ్యారెంటీ (no guarantee) మాత్రం ఉండదని ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో మీరు చెప్పిన హామీలను నెరవేర్చలేమని 9 నెలల్లోనే చేతులెత్తేశారని, ఇప్పుడు చెప్పండి చంద్రబాబు, లోకేష్ (Lokesh) .. జనం వచ్చి ఎవరి చొక్కా కాలర్ పట్టుకుని నిలదీయాలి? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 9 నెలలైంది ఉద్యోగులకు నువ్వు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి బాబు? అని, హామీ ఇచ్చిన ఒక్క పథకమూ (Scheme) ఇవ్వలేదు.. కానీ రాష్ట్రం అప్పులు మాత్రం కొండల్లా పెరిగిపోయాయని అన్నారు. మరి ఈ డబ్బంతా ఏమైపోయింది.. ఎక్కడికి వెళ్తోంది.. ప్రజలకు సమాధానం చెప్పాలి అని అడిగారు. ఇప్పటివరకు రూ. 1,40,000 కోట్ల అప్పులు (borrowed) చేశారని, ఇవన్నీ ఎవరి జేబులోకి పోతున్నాయని ప్రశ్నించారు. అంతేగాక ఒక్క కొత్త ఉద్యోగం(Job) ఇవ్వలేదు.. కానీ 2 లక్షలకు పైగా వాలంటీర్ల ఉద్యోగాలు (volunteer Jobs) తీసేశారని, గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని కూడా ఇతర శాఖల్లో సర్దేస్తున్నారని తెలిపారు.
ఇక వాలంటీర్లను ఎలా మోసం చేశారో.. ఉద్యోగుల్ని అలాగే మోసం చేస్తున్నారని, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్(IR) ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు అంతేగాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ (PRC) అని చెప్పి.. ఉన్న పీఆర్సీ ఛైర్మన్ ను పంపించేశారని దుయ్యబట్టారు. ఉద్యోగులకి ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలిస్తానన్నావ్.. ఏ నెలలో ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఆర్థిక విధ్వంసం అని, మా హయాంలో 4 పోర్టులు (Ports) కట్టాం.. 10 ఫిషింగ్ హార్బర్లు (Fishing Harbors) నిర్మించే కార్యక్రమాలు చేశామని తెలిపారు. 14 ఏళ్ల 8 నెలలు సీఎంగా చేశావ్ కదా చంద్రబాబూ.. నువ్వు కట్టిన ఒక్క పోర్టు పేరైనా చెప్పగలవా? కనీసం ఒక్క ఫిషింగ్ హార్బర్ నిర్మాణమైనా చేశావా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అక్కరకు రాని నీ 40 ఏళ్ల అనుభవం ఎందుకు చంద్రబాబు.. నాలుక గీసుకోవడానికా? అని హాట్ కామెంట్స్ చేశారు. ఇక సంపద సృష్టిస్తాను అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని, చంద్రబాబు మాటలు నమ్మి మా జీవితాలు నాశనం అయిపోయాయి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.