- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో వైఎస్ సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్
దిశ వెబ్ డెస్క్: ఈ రోజు కడపలో వైఎస్ సునీత కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి చనిపోయి ఐదేళ్లు అవుతున్నా నేటికీ కేసు కొలిక్కి రాలేదని మండిపడ్డారు. వివేకా చనిపోయిన రోజు ఎవరు హత్య చేశారో తెలీదని.. కానీ ఈ రోజు హత్య చేసింది బంధువులే అని అన్నీ సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని పేర్కొన్నారు.
గూగుల్ మ్యాప్స్, కాల్ రికార్డ్స్, వాఙ్మూలాలూ ఈ సాక్ష్యాలన్నీ హత్యా చేసిన వాళ్ళు వీళ్ళు అని చూపుతున్నా.. ఈ రోజు వరకు హత్యా చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్షపడకపోవడానికి కారణం.. అన్న అని పిలిపించుకున్నవాడే వివేకా హత్యా కేసులో హంతకులకు శిక్ష పడకుండా నేరస్థులకు అండగా ఉన్నాడని ఆరోపించారు. వివేకా హత్యాతో నష్టపోయింది అయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత అని ఆవేదన వ్యక్తం చేశారు.
సౌభగ్యమ్మ, సునీత బాధితులు వారిని ఓదార్చడం, వారికి ఓ భరోసా కల్పించడం మానేసి సునీత, సునీత కుటుంబం హత్యా చేసిందని ఆరోపించడం ఎంతవరకు సబబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి అద్దం ముందు నిలబడి మీ అంతరాత్మని సునీత వివేకాను హత్యా చేసిందా అని అడగండి.. మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి అని సూచించారు. అసలు జగన్ ఇంతగా దిగజారిపోతారని ఎవరు ఊహించలేదు అన్నారు. సాక్షి పేపర్ లో పైన రాజశేఖర్ రెడ్డి బొమ్మ.. కింద వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని హత్యా చేసేలా రాతలు అని మండిపడ్డారు.
అయన చివరి నిమిషం వరకు వైసీపీ కోసమే పని చేశారుగా.. ఆ రోజు మీకు ఆయన వ్యక్తిత్వం కనిపించలేదారా..? అసలు మీరు మనుషులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఎన్నిరకాలుగా బెదిరించారు.. తోడబుట్టిన చెల్లెల్లు అని కూడా చూడకుండా బూతులు తిట్టారని.. అవమానించారని పేర్కొన్నారు. అన్నింటిని సునీత తట్టుకుందని.. నేడు ఇక్కడ నిలబడిందని తెలిపారు.
గడిచిన ఇన్ని సంవత్సరాల్లో న్యాయం జరగాలని, హంతకులకు శిక్ష పడాలని సునీత తిరగని చోటు లేదని.. కొట్టని తలుపు లేదని.. నిజంగా సునీత ఈ హత్యా చేసి ఉంటే ఈ కేసు గురించి ఇంతలా శ్రమించాల్సిన అవసరం తనకేంటి అని ప్రశ్నించారు. సునీత, సునీత కుటుంబమే కనుక హత్య చేసి ఉంటె 2019 లో అధికారంలోకి వచ్చారు కదా.. కేసు మీ చేతుల్లోనే ఉంది కదా మరి సునీతను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు. ఎందుకు సునీత కుటుంబాన్ని ప్రశ్నించలేదు అని ప్రశ్నించారు. ఎందుకంటే దోషులు ఎవరో..నిర్దోషులు ఎవరో మీకు తెలుసు అందుకే సునీతను అరెస్ట్ చెయ్యలేదని స్పష్టం చేశారు.
Rad More : CM జగన్‌పై వివేకా భార్య సంచలన ఆరోపణలు