ప్రతిపక్షాలకు నోటీసులిచ్చేందుకేనా మహిళా కమిషన్: బీజేపీ నేత సాధినేని యామిని

by Seetharam |   ( Updated:2023-07-27 11:05:43.0  )
Sadineni Yamini
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో వేలాది మంది మహిళలు, బాలికలు అదృశ్యం అవుతున్నారని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సాధినేని యామిని శర్మ ఆరోపించారు. మహిళలు అదృశ్యం వెను ఉన్న శక్తులు ఎవరు అని నిలదీశారు. ఏపీలో మహిళలు, బాలికల అదృశ్యాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం స్త్రీల భద్రత చాలా ప్రమాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళకు హోం శాఖ మంత్రి పదవిచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం మహిళ రక్షణ కోసం ఏం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో స్త్రీలు నిజంగానే తప్పిపోతున్నారా లేక ఎవరైనా తప్పిస్తున్నారా అని యామినీ అనుమానం వ్యక్తం చేశారు. లేకపోతే మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్నారా అని యామినీ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలాది మంది ఆడబిడ్డలు అదృశ్యమవ్వడానికి కారణం ఏంటని నిలదీశారు. అదృశ్యమైన ఆడవాల్లంతా ఏమైపోతున్నారోనన్న ఆందోళన కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో నిర్భయ చట్టం అమలు చేసేందుకు కేంద్రం నిధుల ఇస్తోందని..కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. మహిళల రక్షణ కోసం అని దిశ అనే ఒక యాప్ క్రియేట్ చేస్తే సరిపోదని మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా కమిషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకులకు నోటీసులు పంపించడంలో ఏపీ మహిళా కమిషన్ ఉత్సాహాన్ని చూపుతోందని విమర్శించారు. మహిళకు రక్షణ అందించడంలో మహిళా కమిషన్ ఫెయిల్ అయ్యిందని..ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సాధినేని యామిని ఓ ప్రకటనలో సూచించారు.

Advertisement

Next Story

Most Viewed