చంద్రబాబు ఎప్పుడుపోతాడా? టీడీపీని ఎలా కలిపేసుకోవాలా?అని పవన్ కల్యాణ్ తాపత్రాయం

by Seetharam |
చంద్రబాబు ఎప్పుడుపోతాడా? టీడీపీని ఎలా కలిపేసుకోవాలా?అని పవన్ కల్యాణ్ తాపత్రాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఏమైనా సందేహాలు ఉంటే కోర్టులకు వెళ్లి తేల్చుకోవాలని సూచించారు. విజయవాడలో సోమవారం మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఇచ్చిన న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం అట్టర్ ప్లాప్ అన్నారు. సంకేళ్లు వేసుకోవడం అంటే తమకూ సంకేళ్లు వేయాలని టీడీపీ పిలుస్తోందని అర్థమా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.రోజుకు 24 గంటలు ఉంటే కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఖైదీ నెంబర్ 7691 చంద్రబాబు నాయుడు కోర్టు పరిదిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం విషయంపై ప్రభుత్వం చేసేదేమీ లేదని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

చంద్రబాబుపై పవన్ మెుసలికన్నీరు

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వాన్ని నిందిస్తున్న పవన్ కల్యాణ్... చంద్రబాబుకు ప్రయివేటు వైద్యం కావాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌లలో బిజీబిజీగా ఉన్నారని.. షూటింగ్ గ్యాప్‌ మధ్యలో చంద్రబాబుపై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చంద్రబాబు ఎప్పుడు పోతాడా? ఎప్పుడు టీడీపీని జనసేనలో ఎప్పుడు కలుపుకుందామా అని పవన్ కల్యాణ్ ఆతృతగా ఎదురు చూస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. టీడీపీని జనసేనలో కలుపుకునేందుకే చంద్రబాబుపై కపటప్రేమ నటిస్తున్నారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనీవాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story