- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Deputy CM Pawan:2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవకపోతే రాష్ట్రానికి ఇదే జరిగేది!?

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada) సమీపంలోని కృష్ణాజిల్లా కొండపావులూరులో నిర్వహించిన NDRF(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాల్గొన్నారు. రాష్ట్ర యంత్రంగం పరిష్కరించలేని సమస్యలను ఎన్డీఆర్‌ఎఫ్ పరిష్కరించిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో ఎన్డిఆర్ఎఫ్ సేవలు ఎంతో కీలకమన్నారు. గత ఏడాది విజయవాడలో వచ్చిన వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఆయన అభినందించారు.
మనుషుల ప్రాణాలను కాకుండా మూగజీవుల ప్రాణాలను కూడా NDRF కాపాడిందని తెలిపారు. విపత్తులు కేవలం ప్రకృతి సంబంధించినవే కాకుండా మానవులు సృష్టించినవి కూడా ఉంటాయన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలవకపోతే రాష్ట్రానికి పెద్ద విపత్తు జరిగేదన్నారు. స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దక్షిణ భారత్‌కు సంబంధించి ఎన్డీఆర్‌ఎఫ్ ప్రధాన కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం పై ప్రధాని మోడీ, అమిత్ షా కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.