చంద్రబాబును జైల్లో పెట్టి సాధించిందేమిటి? నెత్తిన పాలుపోయడం తప్ప: చింతా మోహన్

by Seetharam |   ( Updated:2023-10-25 08:10:08.0  )
చంద్రబాబును జైల్లో పెట్టి సాధించిందేమిటి? నెత్తిన పాలుపోయడం తప్ప: చింతా మోహన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి అని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ అన్నారు. కక్షపూరిత రాజకీయాలకు రాష్ట్రం వేదికగా మారడం దారుణం అని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా ఉందని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతుల్లో వెళ్తుందని మండిపడ్డారు. విద్యా వ్యవస్థని బ్రష్టు పట్టించి రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు మాన్యువల్‌లోనే ఫోన్ సౌకర్యం కూడా కల్పించాలని ఉందని కానీ చంద్రబాబుకు అలాంటి అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. చంద్రబాబుని 50 రోజులు జైల్లో పెట్టి ఏం సాధించారని నిలదీశారు. చంద్రబాబు నెత్తిన పాలు పోశారని అభిప్రాయపడ్డారు. ఐపీఎస్ అధికారులు ఇండియన్ పొలిటికల్ సర్వీసులో ప్రారంభించినట్టుందని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ విరుచుకుపడ్డారు. ఇన్ని రోజులుగా చంద్రబాబును జైలులో పెట్టి సాధించిందేంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయని నిరూపించగలిగారా? అని ప్రశ్నించారు. మార్గదర్శి, రామోజీరావుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ నిరసిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇకనైనా జగన్ కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలి అని కేంద్ర మాజీమంత్రి కాంగ్రెస్ నేత చింతా మోహన్ సూచించారు.

చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ

చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. కోర్టుల్లో బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపించారు. కోర్టుల పైన కూడా ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. జడ్జిమెంట్ ఢిల్లీలో తయారవుతున్నాయని చింతా మోహన్ ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టుపట్టాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ రోజు మార్పు వచ్చిందని...చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ అన్నారు. మరోవైపు గాజాపై ఇజ్రాయిల్ దాడి చేస్తుంటే ఇజ్రాయిల్‌కు బీజేపీ మద్దతు పలకడం దుర్మార్గం అన్నారు. విదేశాంగ విధానం పూర్తిగా తప్పు అని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed