- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోదావరి జిల్లాల్లో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి కీలక నేత.. ముహూర్తం ఫిక్స్
దిశ, వెబ్ డెస్క్: అమలాపురంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఇంచార్జుల మార్పు నిర్ణయం వైసీపీలో భారీ కుదుపు తీసుకొచ్చింది. పార్టీలో ఉంటే సీటు దక్కడం కష్టమని భావిస్తున్న నేతలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు పార్టీ మారుతున్నామని బహిరంగంగా చెప్పి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇన్ని రోజులు వైసీపీకి జై కొట్టిన రాష్ట్ర శెట్టి బలిజ యాక్షన్ ఫోర్స్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ మూడు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
సీఎం జగన్ పాలనలో తనకు అన్యాయం జరిగిందని, అందుకే రాజీనామా చేస్తున్నానని వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్ల కేసులో తన సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. ఆ కేసులు ఎత్తివేయకుండా స్థానిక నాయకులు అడ్డుకున్నారని సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన నాయకులతో సమాశమైన ఆయన సైకిల్ ఎక్కాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే వాసంశెట్టి సుభాష్ టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం ఆయన పసుపు కండువా కప్పుకోబోతున్నారు. తనతో పాటు 5 వేల మంది సైకిల్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీలోకి చేరేందుకు వాసంశెట్టి సుభాష్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమలాపురంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు.
Read More..