Varahi Yatra: ఆ మాట మాట్లాడటానికి సిగ్గుండాలి.. సీఎం జగన్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం

by srinivas |   ( Updated:2023-06-30 14:29:23.0  )
Varahi Yatra: ఆ మాట మాట్లాడటానికి సిగ్గుండాలి.. సీఎం జగన్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ విదేశీ విద్య పథకం తీసేసి జగన్ పేరు పెట్టుకున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం కాదని, యువతకు సీఎం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. సంపదంతా ఒక్కరి వద్దే ఉంటే ఎలా అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.తాను ఊగిపోతూ మాట్లాడుతున్నానంటున్నారని, కోపం వస్తే తిరగబడతారని, ఊగిపోతారని గుర్తు చేశారు.

వైఎస్ జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని, కులం పేరు పెట్టుకున్న వ్యక్తి ఆ మాట మాట్లాడటానికి సరిపోడని పవన్ విమర్శించారు. క్లాస్ వార్ పదం పలికే హక్కు జగన్‌కు లేదన్నారు. 30 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని పవన్ మండిపడ్డారు. 50 వేల మంది పొట్టకొట్టి ఇసుక రీచ్‌లను 3 కంపెనీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. క్లాస్ వార్ అనడానికి సీఎంకు సిగ్గుండాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Next Story