- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Polavaram ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత.. Chandrababu బైఠాయింపు
దిశ వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లేందుకు యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. అనుమతిలేదని, వెనక్కి వెళ్లిపోవాలని చెప్పడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు అందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ నాయకుడిని ఎందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లనివ్వరని ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ ఘటనతో పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ బైఠాయించాారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఏ కారణాలతో తనను అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు.