- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:తిరుమల మాదిరిగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) మాదిరిగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. తుమ్మల చెరువులో టైగర్ సఫారీకి అవకాశం ఉందన్నారు. శ్రీశైలం వన్యప్రాణుల అభయారణ్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్లు వదిలినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. అందుకే ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలానికి సి ప్లేన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శ్రీశైలం పర్యాటకానికి(Srisailam Tourism) అనుకూలమైన ప్రాంతమని సీఎం అన్నారు. శ్రీశైలం సమీపంలో కొండల వద్ద గుహలు ఉన్నాయని ఎక్కడ ట్రెక్కింగ్‌కు, ధ్యాన కేంద్రానికి అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం మంత్రులు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్, ఆనం, బీసీ జనార్ధన్‌తో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి 40 నిమిషాల్లో వచ్చామని ప్రెస్‌మీట్‌లో చెప్పారు.