ఏలూరు కాల్వకు పోలవరం కాల్వను అనుసంధానం చేస్తాం : నారా లోకేశ్

by Seetharam |
ఏలూరు కాల్వకు పోలవరం కాల్వను అనుసంధానం చేస్తాం : నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు కాలువకు పోలవరం కాలువను అనుసంధానం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ను అంపాపురం గ్రామస్తులు కలిశారు. టీడీపీ పాలనలో పోలవరం కాల్వ నుండి ఏలూరు కాల్వ అనుసంధానానికి చర్యలు చేపట్టారని ప్రస్తుతం ఆ పనులు నిలిచిపోయాని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పనులను తిరిగి ప్రారంభించాలని కోరారు. కాల్వల అనుసంధానం నిమిత్తం అప్పట్లో రూ.15కోట్లు మంజూరు చేశారు అని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసింది అని లోకేశ్‌కు తెలిపారు. పోలవరం కాల్వను ఏలూరు కాల్వలో కలపడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి అని చెప్పుకొచ్చారు. ఏలూరు పట్టణానికి త్రాగు, సాగు నీరు పుష్కలంగా అందుతుందని తెలిపారు. తమ గ్రామంలోని మల్లిగాని చెరువు రిజర్వాయర్ కూడా పుష్కలంగా నిండుతుంది. మీరు అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన పనులను పూర్తిచేయాలి అని కోరారు. అంపాపురం గ్రామస్థుల వినతిపై లోకేశ్ స్పందించారు. వైఎస్ జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు అని ఆరోపించారు. కనీసం ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోకపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది అని గుర్తు చేశారు. పులిచింతల,గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే పట్టించుకునే దిక్కులేదు అనిఘాటుగా విమర్శించారు. టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294కోట్లు ఖర్చుచేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగోవంతు ఖర్చుచేయలేదు అని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏలూరు కాలువకు పోలవరం కాలువను అనుసంధానం చేస్తాం అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.


Next Story