- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Daggupati: ఎన్టీఆర్వద్ద ఇద్దరం అన్నీ నేర్చుకున్నాం..

దిశ, డైనమిక్ బ్యూరో: తాను, దగ్గుపాటి వెంకటేశ్వరరావు (Daggupati venkateswararao) ఎన్టీఆర్వద్ద అన్నీ నేర్చుకున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అన్నారు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari) కూడా పాల్గొనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచ తత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని అన్నారు. ప్రపంచ దేశాలు, పాలన వ్యవవస్థలపై ఒక పుస్తకం రాసినట్లు తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఆదినుంచి నేటి వరకు వివరాలు ఉన్నాయన్నారు. మా కుటుంబంలో ఒక మంచి రచయిత ఉండడం ఆనందం కలిగిస్తుందన్నారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. 2014లో నిర్మలా సీతారామన్ (Nirmala seetaraman) మొదటి సారి ఎంపీగా ఏపీ నుంచే రాజ్యసభకు ఎంపికయ్యారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి వెంకయ్యనాయుడు అని కొనియాడారు. తాను, వెంకయ్యనాయుడు ఇద్దరం 1978లో ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి ప్రవేశించామన్నారు. వెంకయ్యనాయుడు నిర్మోహమాటంగా అభిప్రాయాలను తెలియజేస్తారని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో పరందేశ్వరి చూపించిన చొరవను అందరం చూశామన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkayya naidu) మాట్లాడుతూ పెద్దలు రాబోయే తరాలకు విజ్ఞానాన్ని అందించాలన్నారు. ఆ నానుడిని అర్ధం చేసుకుని మంచి పుస్తకం రాసిన వెంకటేశ్వరరావుని అభినందించారు. ప్రపంచ చరిత్ర పుస్తకంగా రాయడం అంత సులభం కాదన్నారు. చరిత్రను సరిగా నమోదు చేయడం అవసరం అన్నారు. దేశ విభజన కారణంగా మనం చాలా చరిత్రను కోల్పోయామన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్మాట్లాడుతూ చరిత్రను రాయడం చిన్న విషయం కాదన్నారు. ఇటువంటి పుస్తకాలు మరిన్ని రాయాలని ఆకాంక్షించారు. ఇలాంటి ప్రయత్నం ఎంతో అభినందనీయమన్నారు. పుస్తక రచయిత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పుస్తకం రాయడం వెనుక ఎంతో కృష్టి ఉందన్నారు. తాను ఎంబీబీఎస్చదివానన్నారు. తాను సైన్స్చదివినట్లు తెలిపారు. అయితే చరిత్ర తెలుసు కోవాలనే ఉత్సుకత తనకు ఉందన్నారు. అదే పుస్తకాన్ని రాయడానికి పురిగొల్పిందన్నారు. దగ్గుపాటి పురందేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన దక్షత గురించి కొనియాడారు. చరిత్ర పుటల్లో ప్రపంచాన్ని మార్చిన అనేక ఘటనలు ఉన్నాయని అన్నారు. గత చరిత్రలో జరిగిన సంఘటనలు మనకు పాఠాలు కావాలన్నారు.