- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఓట్ల దొంగలు.. ప్రతిపక్షాల ఓట్లు తొలగించే కుట్ర: సీఈసీకి టీడీపీ ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఓట్ల దొంగలు చొరబడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడం, చీల్చడం కోసం జగన్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు అని ఆరోపించారు. ఏపీలో ప్రతిపక్షాల ఓట్లన్నీ తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. మ్యానిపులేషనుతోనే ఎన్నికల్లో గెలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో ఓట్ల దొంగలు పడ్డారని మండిపడ్డారు. ఏపీలో ఓటర్ల జాబితాకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నిలక అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలతో కలిసి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..వలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీలోని ఓటర్ జాబితాలో అవకతవకలపై సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. పర్చూరు, తిరుపతిలో ఓట్ల అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా విచారణ ముందుకు సాగడం లేదని చెప్పుకొచ్చారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఫిర్యాదు మీద మరింత దర్యాప్తు జరగాల్సి ఉందని చెప్పుకొచ్చారు. వలంటీర్లు ఫామ్-6,7 పేర్లతో నిబంధనలకు విరుద్దంగా అప్లై చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా 57 మంది ఒక్కొక్కరూ వేయి అప్లికేషన్లు పెట్టారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా ఫాం-7 అప్లికేషన్లు దాఖలు చేసిన వారి వివరాలను అధికారులకు జిల్లాల వారీగా అందజేశామని అచ్చెన్నాయుడు తెలిపారు.