AP Politics:వాళ్లిద్దరికీ ఓటేస్తే..ఓటు డ్రైనేజీలో వేసినట్లే: వైఎస్ షర్మిల

by Jakkula Mamatha |   ( Updated:2024-04-25 11:22:30.0  )
AP Politics:వాళ్లిద్దరికీ ఓటేస్తే..ఓటు డ్రైనేజీలో వేసినట్లే: వైఎస్ షర్మిల
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలో పర్యటించారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో షర్మిల పాల్గొని ప్రసంగించారు. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు. సభలో షర్మిల మాట్లాడుతూ..చంద్రబాబు, జగన్ బీజేపీని పట్టుకుని వేలాడుతున్నారు అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. అంతే కాదు దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ లేదని, ఆ దుస్థితి ఒక మన రాష్ట్రానికే ఉందని విమర్శించారు. ఈ పరిస్థితికి కారణం వైసీపీ, టీడీపీనే అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరికీ ఓటేస్తే ఓటు డ్రైనేజీలో వేసినట్లే అని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పదేళ్లలో రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందా? అని షర్మిల ప్రశ్నించారు.

Advertisement

Next Story