Yv Subbareddy: జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి

by srinivas |
Yv Subbareddy: జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి
X

దిశ, ఉత్తరాంధ్ర: జగనన్న ఆరోగ్య సురక్ష, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? అనే అంశాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి దిశా నిర్దేశం చేశారు. వైఎస్ఆర్ సీపీ విజయనగరం జిల్లా కేంద్రంలో జె - ఫంక్షన్ హాలులో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 175 సీట్లు గెలుచుకునే విధంగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. పార్టీ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడే తిప్పి కొట్టాలన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story