Visakha: నారా లోకేష్‌కు జనసేన నేతల సంఘీభావం

by srinivas |
Visakha: నారా లోకేష్‌కు జనసేన నేతల సంఘీభావం
X

దిశ, విశాఖపట్నం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు విశాఖ జిల్లా జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. రాజమండ్రిలో లోకేష్‌ను కలిసి పరామర్శించారు. చంద్రబాబును తప్పుడు కేసులతోనే జైలుపాలు చేశారని లోకేష్ ఈ సందర్భంగా మండిపడ్డారు. అక్రమ కేసులతో ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని ధ్వజమెత్తారు. తనకు అండగా నిలుస్తున్న జనసేన నేతలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు అంతా కలిసి పోరాడతామని జనసేన శ్రేణులు లోకేష్‌కు మాటిచ్చారు. లోకేష్‌ని కలిసిన వారిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, చోడవరం ఇంచార్జ్ పి.ఎస్. ఎన్.రాజు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed