Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత

by srinivas |
Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెయిల్ తరహా వేతనాలు ఇవ్వాలంటూ ప్లాంట్ పరిపాలన భవనాన్ని ముట్టడించేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నించాయి. అంతేకాదు భవనం వైపు వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. బారికేడ్లు తొలగించి భవనంలోకి వెళ్లేందుకు యత్నించారు.


దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కార్మిక సంఘాల నేతలు మాత్రం ఆందోళనను కొనసాగిస్తున్నారు. ప్లాంట్ యాజమాన్యం నుంచి సరైన సమాధానం వచ్చే వరకూ తమ ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు.

Advertisement
Next Story