Vishaka: ఆర్టీసీ బస్సులో మేయర్ ప్రయాణం

by srinivas |   ( Updated:2022-12-19 15:21:58.0  )
Vishaka: ఆర్టీసీ బస్సులో మేయర్ ప్రయాణం
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి బస్సెక్కి ప్రయాణికులతో ముచ్చటించారు. బస్సులోనే ప్రయాణించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. వారానికోరోజైనా జీవీఎంసీ ఉద్యోగులు తమ సొంత వాహనాలు వదిలి ప్రజా రవాణా వ్యవస్థనే ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునివ్వడమే కాకుండా పాటిస్తున్నారు కూడా. సోమవారం ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి బస్టాపు వరకు నడుచుకుంటూ వెళ్లి ఆ తర్వాత ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించి అనంతరం జీవీఎంసీ కార్యాలయానికి చేరుకుని 'స్పందన'లో పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణకు నగర వాసులు సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఆమె వెంట వైసీపీ సీనియర్‌ నేత గొలగాని శ్రీనివాసరావు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed