- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tragady: సముద్రంలో విరుచుకుపడ్డ అలలు.. ఒకరి మృతి.. మరొకరు గల్లంతు
దిశ, వెబ్ డెస్క్: సముద్ర స్నానం ఇద్దరు యువకుల ప్రాణం మీదకు వచ్చింది. పండుగ సెలవుల నేపథ్యంలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు సరదాగా గడిపేందుకు విశాఖ ఆర్కే బీచ్‌కు వెళ్లారు. స్నానం చేసేందుకు సముంద్రంలోకి దిగారు. కొంతసేపు సముద్రంలో సరదాగా ఈత కొట్టారు. అయితే అలలు దాటికి విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. సముద్రపు నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న మెరైన్ సిబ్బంది సముద్రంలో గాలించారు. అయితే ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి మృతదేహాం లభ్యమైంది. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగింది.
విశాఖ ఎన్నారై కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఇద్దరి విద్యార్థులు గురువారం ఉదయం ఆర్కే బీచ్‌కు వెళ్లారు. అనంతరం సముద్రంలో స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. మిగిలిన వాళ్ల అరుపులు, కేకలతో మెరైన పోలీసులు, ఇతర సిబ్బంది సముద్రంలో గాలించారు. ఇద్దరు విద్యార్థుల్లో ఒకరైన హర్ష మృతదేహాన్ని వెలికితీశారు. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో ఆర్కే బీచ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హర్ష మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విద్యార్థులు గల్లంతు విషయాన్ని కాలేజీకి, తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.