Breaking: విశాఖలో కిడ్నీ దందా ముఠా అరెస్ట్...లొంగిపోయిన దళారులు!

by srinivas |
Breaking: విశాఖలో కిడ్నీ దందా ముఠా అరెస్ట్...లొంగిపోయిన దళారులు!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ కిడ్నీ ముఠాను పోలీసుల అరెస్ట్ చేశారు. బాధితులను మోసం చేసిన దళారీలు లొంగిపోయినట్లు తెలుస్తోంది. స్రవంత్ అనే వైద్యుడిపైనే అనుమానాలు వ్యక్తమవతున్నాయి. తిరుమల ఆస్పత్రి ఓనర్ డాక్టర్ పరమేశ్వర్ రావు ఆధ్వర్యంలో డాక్టర్ స్రవంత్ కిడ్నీ తొలగించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి ఓవర్ డాక్టర్ పరమేశ్వర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మరో వైపు ఈ ఆస్పత్రి దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాంబే కాలనీకి చెందిన కిడ్నీ బాధితుడు వినయ్ ఫిర్యాదుతో తిరుమల ఆస్పత్రి వ్యవహారం గుట్టురట్టయింది. దీంతో బాధితులు క్యూ కట్టారు. ఈ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ కాదని సరగసీ దందా కూడా జరిగిందని చెబుతున్నారు. కిడ్నీకి రూ.8 లక్షలు, సరోగసీకి రూ.2 లక్షల ఇచ్చేలా పేదలనే టార్గెట్ చేసి దందా నడిపించారని ఆరోపిస్తున్నారు. ఈ దందా అంతా మధ్యవర్తుల ద్వారానే నడిచేదని అంటున్నారు. ఇలా చాలా కిడ్నీ ఆపరేషన్లు జరిగినట్లు చెబుతున్నారు. డాక్టర్ స్రవంత్ ఆధ్వర్యంలోనే ఈ ఆపరేషన్లు జరిగాయని అంటున్నారు.

Advertisement

Next Story