- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visaka: ఆంధ్ర యూనివర్సిటీపై టీడీపీ నేత సంచలన ఆరోపణలు
దిశ, విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయమా..? లేక వైసీపీ కార్యాలయమా అని టీడీపీ విశాఖ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ ప్రశ్నించారు. టీడీపీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ఏయూని దేవాలయంగా భావిస్తారని.. అలాంటి వర్సిటీని వైసీపీ కార్యాలయంలా మార్చేశారని మండిపడ్డారు. విశ్వవిద్యాలయమా?.. లేక వైసీపీ కార్యాలయమనే అనుమానం కలుగుతుందన్నారు. ఏయూ ప్రతిష్టను విసి ప్రసాద్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు.
ఏయులో జరుగుతున్న అరాచకాలపై మేధావులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. జేమ్స్ స్టీవెన్ అనే వ్యక్తిని అడ్డగోలుగా వీసీ సభ్యుడిగా చేర్చారని, ఆ తరువాత అంబెడ్కర్ చైర్ ప్రొఫైసర్‌గా చేర్చారని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా ఆయన్నురిజిస్టర్‌గా చేశారని తెలిపారు. 16 విశ్వవిద్యాలయాల్లో 2 వేల మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, జగన్ పాదయాత్ర సమయంలో వారిని క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మరిచి పోయారని ఎద్దేవా చేశారు. విశ్వ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చి జగన్ మనుషులను విశ్వ విద్యాలయాల్లో నియమించాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ 2లో ఇంటర్వూలు లేకుండా చేరారని, రాయలసీమ ప్రాంతానికి చెందిన చాలా మంది ఈ నియామకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేరారని తెలిపారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత సమీక్ష ఉంటుందని పాశర్ల ప్రసాద్ వెల్లడించారు.