- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: విశాఖ యువతి శ్వేత డెత్ కేసులో సంచలన విషయాలు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ యువతి శ్వేత డెత్ కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. తల్లి ముందే శ్వేతను భర్త కొట్టేవారని, వేధించేవారని విశాఖ సీపీ త్రివిక్రమ్ తెలిపారు. అంతేకాదు శ్వేత అడపడుచులు కూడా వేధించేవారని ఆయన పేర్కొన్నారు. చిన్న చూపు చూస్తూ శ్వేతను తక్కువ చేసి మాట్లాడేవారన్నారు. గతంలో కూడా శ్వేత ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. శ్వేత శరీరంపై గాయాల్లేవని పోస్టుమార్టంలో తేలిందని తెలిపారు. శ్వేత ఫోన్‌ను ఎఫ్‌ఎస్ఎల్ పంపామని, సీసీ టీవీ ఫుటేజ్ దొరకలేదని విశాఖ సీపీ త్రివిక్రమ్ వెల్లడించారు.
అనుమానాస్పద స్థితిలో శ్వేత మృతి
కాగా విశాఖ ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇరవై నాలుగేళ్ల శ్వేత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కేజీహెచ్‌లో ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు. శ్వేత మృతిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, అనుమానాస్పద మృతిగా కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో మరో విషయం వెలుగు చూసింది. శ్వేత ఆడపడుచు భర్త నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. దీంతో ఆమె భర్త పైన లైంగిక వేధింపులు, అత్త, ఆడపడుచుపై వరకట్న వేధింపుల కేసులు పెట్టారు.
పోలీసుల అదుపులో భర్త కుటుంబ సభ్యులు
ఐదు నెలల గర్భిణీ శ్వేత అనుమానాస్పద కేసుకు సంబంధించి భర్త, అత్త, మామ, ఆడపడుచు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. భర్త తరఫు బంధువులు పోలీసుల అదుపులో ఉండటంతో మృతదేహాన్ని తల్లి, బంధువులకు అప్పగించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిపోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.