AP News:ఏపీలో మరోసారి ఎన్నికలు..ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి..పోలింగ్ ఎప్పుడంటే?

by Jakkula Mamatha |
AP News:ఏపీలో మరోసారి ఎన్నికలు..ఆ మూడు జిల్లాల్లో కోడ్ అమల్లోకి..పోలింగ్ ఎప్పుడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ వచ్చిందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే..విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్‌పై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆగస్టు 6న నోటిఫికేషన్ రానుండగా, ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఈ బై ఎలక్షన్ పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో మూడు జిల్లాల్లో (విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు) ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. కోడ్‌ ముగిసేంత వరకూ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఉండవని అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉండవని తెలిపారు

Advertisement

Next Story