Gangavaram Port: కార్మికులతో చర్చలు సఫలం.. 1 నుంచి విధులకు హాజరు

by srinivas |
Gangavaram Port: కార్మికులతో చర్చలు సఫలం.. 1 నుంచి విధులకు హాజరు
X

దిశ,గాజువాక: గంగవరంపోర్టు కార్మికులు సమస్యలను పరిష్కరించామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. పోర్టు కార్మికుల నాయకులతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన చర్చించారు. అనంతరం మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ ఆందోళన చేస్తూ విధుల నుంచి యాజమాన్యం సస్పెండ్ చేసిన ఐదుగురు కార్మికులను ఎటువంటి కండిషన్‌లు లేకుండా తిరిగి విధులలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు గతంలో 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఉండేదని, ఇక నుంచి 25 లక్షలు చెల్లించేలా యాజమాన్యం అంగీకరించిందని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.

2024, ఏప్రిల్ 1న మంజూరు చేసే వార్షిక ఇంక్రిమెంట్‌తో పాటు అదనంగా రూ. 15 వందలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. కార్మికులహెల్త్ పరంగా మెడికోవర్, కేర్, అపోలో, గాయిత్రి విద్యా పరిషత్ వంటి నాలుగు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొనేలా హెల్త్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లో రూ. 10 వేలు బోనస్‌గా చెల్లించడం జరుగుతుందని మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed