- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు ముప్పు.. లోకేశ్‌పైనే అనుమానం వ్యక్తం చేసిన మంత్రి అమర్‌నాథ్
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు జైలులో స్కిల్ అలర్జీ అయింది. అంతేకాదు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయని నారా లోకేశ్, భువనేశ్వరి మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబుకు ముప్పు ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో మంత్రి అమర్‌నాథ్ స్పందించారు. చంద్రబాబు ముప్పు జరిగితే అది లోకేశ్ వల్లే అవుతుందని వ్యాఖ్యానించారు. వెన్నుపోటు రక్తం పంచుకుని పుట్టిన వ్యక్తి లోకేశ్ అని విమర్శించారు. తన భవిష్యత్ కోసం చంద్రబాబును ఏదైనా చేస్తాడనేదే తమ అనుమానమని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. అటు చంద్రబాబుపైనా మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయమంతా మేనేజ్‌మెంట్.. ఈవెంట్ మేనేజ్ చేయడమేనన్నారు. కాంగ్రెస్‌తో కలిసి జగన్ మోహన్ రెడ్డిపై కేసులు పెట్టేందుకు వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేశాడని మంత్రి అమర్‌నాథ్ ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆస్తులు చంద్రబాబుకు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. చంద్రబాబు తొలి నుంచి కూడా దొంగేనని, దొంగ పనులు చేయడం అలవాటని మంత్రి అమర్‌నాథ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.