- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Capital: త్వరలో విశాఖ పాలన రాజధాని.. జేఏసీ సంచలన నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంవోతో పాటు పాలనకు సంబంధించిన భవన నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. దసరా నుంచి విశాఖలో పాలన చేపట్టేందుకు అటు సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు చేసేందుకు వీలుగా అక్కడ సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు మూడు రాజధానుల జేఏసీ భారీ ఎత్తున స్వాగతం పలకాలని భావిస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి పరిపాలన సాగించడాన్ని స్వాగతించారు. విశాఖలో వైవీ సుబ్బారెడ్డి అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ రాక సందర్భంగా పండగలాంటి వాతావరణాన్ని సృష్టించాలని, విశాఖ వాసులనూ ఈ పండగలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు. విశాఖ రాజధానిపై ఉన్న అపోహలను తొలగించాలని ఈ సమావేశంలో జేఏసీ నేతలు విస్తృతంగా చర్చించారు. విశాఖ వందనం పేరుతో కార్యచరణకు ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. రాజధానిని స్వాగతిస్తూ అక్టోబర్ 15న భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేయనున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు కేపిటల్ జేఏసీ తీర్మానం చేసింది.