- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: చంద్రన్నకు బాసటగా మత్స్యకారులు
దిశ, విశాఖపట్నం: పెద్ద జాలారిపేటలో కార్పొరేటర్ నొల్లి నూకరత్నం, బైరెడ్డి పోతన్న ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న బాసటగా మత్స్యకారులు సముద్రంలో బోట్లపై వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నొల్లి నూకరత్నం మాట్లాడుతూ మత్స్యకారులకు సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పాలనలోనే జరిగింది అని అన్నారు. హోసింగ్ నిర్మాణం, పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని పేర్కొన్నారు. ఎం.ఎల్.ఏ వెలగపూడి రామకృష్ణ బాబుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అన్నారు. నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌పై వచ్చేవరకు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. జోన్1 మీడియా కో-ఆర్డినేటర్ బైరెడ్డి పోతన్న మాట్లాడుతూ వైస్సార్ ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఈ రకంగా అరెస్టు చేసి రిమాండ్‌కి పంపడం ప్రజలు హర్షించడంలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్లు రూపంలో వైఎస్సార్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.