Accident: లోయలోకి దూసుకెళ్లిన బొలేరో.. ఒకరు మృతి, 16 మందికి గాయాలు

by srinivas |   ( Updated:2023-11-17 06:12:39.0  )
Accident: లోయలోకి దూసుకెళ్లిన బొలేరో.. ఒకరు మృతి, 16 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి లోయలోకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందారు. 16 మందికి గాయలయ్యాయి. ఈ ఘటన పాడేరు మండలం రాయికోట ఘట్‌లో జరిగింది. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. అయితే వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. చనిపోయిన వ్యక్తి నూకరాజుగా గుర్తించారు. లోయలో పడిన వాహనాన్ని బయటకు తీశారు. ప్రమాద వివరాలు సేకరించారు. మృతులు, క్షతగాత్రులు కూలీలని తెలిపారు. బొలేరో వాహనంలో రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. అతివేగమే కారణమని ప్రథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story