బీచ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

by Jakkula Mamatha |
బీచ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: అనారోగ్య కారణంగా ఆర్కే బీచ్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని జీవీఎంసీ లైఫ్ గార్డ్ కాపాడారని జీవీఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు పత్రికా ప్రకటన ద్వారా శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద మత్స్య దర్శిని సమీప బీచ్‌లో విశాఖపట్నం ఎన్.ఎ.డి ప్రాంతానికి చెందిన నున్న చిట్టి బాబు (వయసు 72 సంవత్సరాలు) అనే వ్యక్తి అనారోగ్య రీత్యా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, అక్కడే విధులు నిర్వహిస్తున్న జీవీఎంసీ లైఫ్ గార్డ్ ఆనంద్, ధనరాజ్, అరవింద్, పోలి రాజు ఆయనను కాపాడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సిపిఆర్ చేసి పోలీసుల సహాయంతో చికిత్స కొరకు అంబులెన్స్ లో కేజీహెచ్ కు తరలించడం జరిగింది అని స్పోర్ట్స్ డైరెక్టర్ తెలిపారు.


Next Story

Most Viewed