vinayaka chavithi: గాజువాకలో కొలువు తీరనున్న భారీ గణేశుడు

by srinivas |
vinayaka chavithi: గాజువాకలో కొలువు తీరనున్న భారీ గణేశుడు
X

దిశ , గాజువాక: గాజువాక లంకా వారి మైదానంలో 117 అడుగుల భారీ గణనాథుడు కొలువు తీరనున్నారు. ఎస్వీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో భారీ గణనాథుడు రూపు దిద్దుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ భారీ గణనాథుడును గాజువాకలో ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా‌కు చెందిన కళాకారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొత్త కొండ నగేష్ ఆధ్వర్యంలో నెల రోజులుగా విగ్రహ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. కొసిరెడ్డి గణేష్ మిత్ర బృందం పృధ్వీ, రవి, బిట్టు, బాబీ నేతృత్వంలో భారీ గణనాథుడు రూపు దిద్దుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఎస్వీ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలుగకుండా గడ్డి , గంగమట్టి , ఎర్రమట్టితో గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పా. ఈ నెల 18న గణేష్ చతుర్థి సందర్భంగా వినాయకుడి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందన్నారు. వినాయక చవితి రోజు నుంచి 21 రోజుల పాటు భక్తులకు గణనాథుడు దర్శనమీయనున్నాడని తెలిపారు. 21 రోజుల అనంతరం ఇదే చోట ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గణనాథుడు విగ్రహ నిర్మాణం పూర్తి కావస్తున్న దని అన్నారు. 21 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed