విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ ఎక్కడ ఆగలేదు: ఎంపీ జీవీఎల్ నరసింహారావు

by Seetharam |   ( Updated:2023-11-16 11:37:05.0  )
విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ ఎక్కడ ఆగలేదు: ఎంపీ జీవీఎల్ నరసింహారావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం రైల్వే జోన్ అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ ప్రక్రియ ఎక్కడ ఆగలేదు అని స్పష్టం చేశారు. రైల్వే జోన్‌కు సంబంధించి భవన నిర్మాణాలు జరుగుతాయి అని స్పష్టం చేశారు. విశాఖ డీఆర్ఎం కార్యాలయంలో గురువారం రైల్వే ఉన్నతాధికారులతో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై డీఆర్ఎం కార్యాలయంలో ఉన్నతాధికారులతో చర్చించినట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ‘విశాఖ కేంద్రంగా ఉన్న రైల్వే పెండింగ్ సమస్యలపై అధికారులతో చర్చించినట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు. సింహాచలం-దువ్వాడ స్టేషన్ అభివృద్ధికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. విశాఖ మీదుగా ఎక్కువ రైళ్లను నడిపేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పెందుర్తిలో స్టేషన్ నిర్మాణం చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే వారణాసి-విశాఖ రైలు రాబోతుంది అని ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed