‘విశాఖ అనేది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్’.. ఎమ్మెల్సీ బొత్స కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘విశాఖ అనేది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్’.. ఎమ్మెల్సీ బొత్స కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ(privatization) గురించి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్‌ అని పేర్కొన్నారు. ఆ ఫ్యాక్టరీ కోసం రైతులు వేలాది ఎకరాల భూములను త్యాగం చేశారని తెలిపారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక స్టీల్‌ప్లాంట్‌(steel plant) ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని ఇప్పటికే ప్రధాని మోడీకి వైఎస్‌ జగన్‌ చెప్పారని తెలిపారు. ఆ ప్లాంట్‌ కార్మికులకు(Plant workers) తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రెండు వారాల నుంచి కార్మికులు నిరసన చేస్తున్నారని బొత్స తెలిపారు. దీని పై కూటమి సర్కారు వైఖరి ఏంటని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఏర్పడిందని చెప్పారు. వైఎస్సార్ హయాంలో ప్లాంట్ విస్తరణకు 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed