- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎటూ తేల్చుకోలేని వసంత.. రెండు పడవలపై ప్రయాణం..
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో పొయ్యి పొసగనప్పుడు పొంత మార్చుడే అన్నట్లు అధిష్టానంతో విబేధాలు వచ్చిన నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి మరో పార్టీ గూటికి మాకం మారుస్తున్న విషయం అందరికి సుపరిచితమే. అయితే వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం ఎటూ తేల్చుకోలేకున్నారు. తాజాగా వసంత కృష్ణప్రసాద్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఇక ఆత్మీయ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఓ వైపు ఎన్టీఆర్, మరో వైపు వైఎస్ఆర్ ఫోటోలను పెట్టారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సైకిల్ ఎక్కనున్నారని అందరూ అభిప్రాయపడుతున్న వేళ ఫ్లెక్సీల్లో వైఎస్ఆర్ ఫోటోలను వేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రస్తుతం మైలవరం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వసంత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఇచ్చిన సంక్షేమ పతకాల గురించి చెప్తే.. అవన్నీ మేము అడిగామా..? మా బిడ్డలకు ఉద్యోగాలు ఏవని..? ఇంటి ముందు డ్రైనేజీ ఏంటని..? రోడ్లు ఎక్కడని ప్రజలు నిలదీస్తున్నారని.. జగన్ డ్రైనేజి, రోడ్లు గురించి ఆలోచించకుండా సచివాలయాలు కట్టిస్తున్నారని వసంత మండిపడ్డారు. ఇక సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు కట్టించిన కాంట్రాక్టర్లకి కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేసారు. కాగా కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదని తన దగ్గర ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తాను ఆ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు వైసీపీ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శల జల్లు కురిపిస్తూనే.. మరో వైపు తాను పార్టీ మారడం లేదని.. వైసీపీ నుండే పోటీ చేస్తానని చెప్పారు. దీనితో ఎటూ తేల్చుకోలేని వసంత రెండు పడవలపై ప్రయాణిస్తున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది.